రుచికరంగా ఏదైనా తినాలని కోరుకుంటున్నారు. అలాగే క్యాల్షియం ఎక్కువగా మరియు క్యాలరీలు తక్కువగా ఉండే వంటను మీరు రుచి చూడాలనుకుంటే, మీ టేస్ట్ బడ్స్ కు కొత్త రుచిని చూపించాలంటే, రుచికరమైన ఎగ్ పొటాటో కర్రీ ఒకటి . ఈవంటి చాలా సింపుల్ గా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ వంటను తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే కొన్ని మసాల దినుసులు జోడించడం వల్ల వంట చాలా టేస్టీగా నోరూరిస్తుంటేంది. మరియ ఈ మసాలా ఎగ్ పొటాటో రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
గుడ్లు : 5
బంగాళదుంపలు : 3 (పొట్టు తీసి ముక్కలుగా కట్ చేయాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
ఉల్లిపాయ పేస్ట్ : 2tbsp
టొమాటో పేస్ట్ : 1cup
ఎర్ర కారం : 1 tsp
పసుపు : ½ tsp
జీలకర్ర పొడి : ½tsp
ధనియాల పొడి : ½tsp
మసాలా పొడి : ¼ tsp
మెంతులు: ¼tsp
పచ్చిమిర్చి: 2చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమిర : కొద్దిగా సన్నగా తరిగిపెట్టుకోవాలి
ఆయిల్ : 4tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్లును ఉడికించి, పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక మీడియం పాన్ తీసుకొని అందులో నూనె వేసి, వేడి అయ్యాక అందులో మెంతులు మరియు కరివేపాకు వేసి తక్కువ మంట మీద ఒక నిముషం వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ మరియు అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే టమోటో పేస్ట్ , కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, అన్ని రకాల మసాలా పొడులు మరియు కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మసాల పొడులన్నీ వేసిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి ఫ్రై చేసుకోవాలి.
6. పోపు 5నిముషాలు వేగిన తర్వాత అందులో బంగాళదుంపల ముక్కలు మరియు 2 కప్పుల నీరు పోసి మిక్స్ చేసి, పాన్ మూత పెట్టాలి.
7. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లను వేసి మిక్స్ చేయాలి. 8. చివరగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు కొత్తిమీర తరుగు వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన ఎగ్ మరియు పొటాటో కర్రీ రిసిపి రెడీ.
No comments:
Post a Comment