Tuesday, October 6, 2015

టీనేజీ యువతులను ఆకట్టుకుంటున్న అనుష్క శర్మ డ్రెస్సింగ్


బ్యాండ్ భాజా భారత్ సినిమా హిట్ సంగతేమో గానీ.. స్టైల్ ఐకాన్ గా నిలిచింది. ఇందులో శ్రుతి కక్కర్ క్యారెక్టర్ చేసిన అనుష్కా శర్మ.. ఢిల్లీ యంగ్ గాళ్ గా నటించింది. ఎడ్యుకేషన్ అయ్యాక.. బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉండే
క్యారెక్టర్ కు తగ్గట్టు రూపొందించిన.. డ్రెస్సింగ్ అందరినీ ఆకర్షించింది. బ్యాండ్ భాజా భారత్ లో అనుష్కశర్మని బాగా గమనిస్తే... ఇందులో ఈ ముద్దుగుమ్మ బ్రైట్ కలర్ డ్రెస్సుల్లోనే మెరిసింది. వెడ్డింగ్ ప్లానింగ్ మీదే స్టోరీ ఉండటంతో.. భారతీయ సంప్రదాయానికి తగ్గట్టు డ్రెస్ కలర్ ఆకర్షణీయంగా ఉంది. ఢిల్లీ యువతులను ఆకట్టుకునేలా.. కుర్తా, స్కార్ఫ్స్, డెనిమ్స్, పటియాలాలను డిజైనర్ నిహారికా ఖాన్ రూపుదిద్దారు.

No comments:

Post a Comment