Monday, November 16, 2015

షుగ‌ర్ వ్యాధిని క‌ట్ట‌డ‌చేయ‌డానికి జీల‌క‌ర్ర...

మనం వంటకాలలో జీలకర్రకు చాలా ప్రాధాన్య‌త ఇస్తాం. పోపు పెట్ట‌డం నుంచి ప‌లు ర‌కాల వంట‌కాల‌కు, కూర‌ల‌కు జీరా ఫ్లేవ‌ర్ త‌గిలితేనే అస‌లైన రుచి, సువాస‌న‌. జీల‌క‌ర్ర పొడిని కూర‌ల్లో వాడితే అమోఘ‌మైన రుచివ‌స్తుంది. జీల‌క‌ర్ర
రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయ‌డంలోనూ రారాజు. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.
ర‌క్త‌హీన‌త‌ రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యమైన పోషకమైన ఐర‌న్ జీల‌క‌ర్ర‌లో పుష్క‌లంగా ఉంటుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం వ‌ల్ల వ‌చ్చే అనీమియా త‌గ్గించుకోవ‌డానికి జీరా బాగా స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త‌హీన‌త ఎక్కువ‌గా పిల్ల‌లు, ఆడ‌వాళ్ల‌లో క‌నిపిస్తుంది. కాబ‌ట్టి జీల‌క‌ర్ర‌ను రెగ్యుల‌ర్ గా తీసుకోవ‌డం మంచిది.

1 comment:


  1. జీల కర్ర గురించి చాలా మంచి మాట చెప్పారు !

    ఇందుకోసమే నెమో పెళ్లి తంతు లో జీల కర్ర పప్పు బెల్లం సూచనా ప్రాయం గా వాడటం !

    జిలేబి

    ReplyDelete