Thursday, November 19, 2015

స్పైసీ బ్రెడ్ ఆలూ బోండా..

బోండా లేదా పకోడా వంటివి నూనెలో ఫ్రైచేసి ఈవెనింగ్ స్నాక్స్ గా తినేటటువంటి చిరుతిండ్లు. దక్షిణ భారత దేశంలో(కర్ణాటక, ఆంధ్ర) వీటి పేర్లు కూడా చాలా ఫేమస్. బోండాను చాలా రకాలుగా వండుతారు. ఆకు కూరలు, కూరగాయలు, లేదా ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు, పచ్చిమర్చి, బంగాళదుంప ఇలా చాలా రకాలు...
ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో ఆలూ బోండా చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ గా బ్రెడ్ ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం.... కావల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్- 6 బంగాళదుంపలు - 3 (ఉడికించిన మరియు మ్యాష్ చేసుకోవాలి) ఉల్లిపాయలు - 1 cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి) జీలకర్ర - 1/4tsp పచ్చిమిర్చి - 1/4tsp పాలు - 1cup నూనె: సరిపడా ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా స్టఫింగ్ కోసం సిద్దం చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, వేసి వేగించాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చిు ముక్కలు వేసి వేగించుకోవాలి.
2. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప , ఉప్పు, కారం వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
3. అంతలోపు బ్రెడ్ స్లైస్ తీసుకొని నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీటి నుండి ఒక్క స్లైస్డ్ పీస్ తీసుకొని పాలలో డిప్ చేసి వెంటనే తీసేయాలి.
4. జస్ట్ డిప్ చేసి బయటకు తీయడం వల్ల మరీ సాఫ్ట్ కాకుండా ఉంటుంది.
5. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్ గా స్టఫింగ్ మిశ్రమాన్ని తీసుకొని బ్రెడ్ పీస్ సెంటర్లో పెట్టాలి . ఇప్పుడు బ్రెడ్ ను నాలుగు వైపులా కవర్ చేయాలి.
6. పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకొన్న బ్రెండ్ బోండాలను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. బోండాలు అన్ని వైపులో బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత పాన్ లో నుండి సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి .
8. ఈ హాట్ అండ్ స్పైసీ బ్రెడ్ బోండాను సాస్ తో పాటు సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది .

No comments:

Post a Comment