Monday, November 23, 2015

కేరళ స్టైల్ ఫిస్ కర్రీ: అలెప్పే ఫిష్ కర్రీ

లెప్పే ఫిష్ కర్రీ కేరళ తీరప్రాంతంలో ఫేమస్ ఫిష్ కర్రీ. కేరళీయులు తినే వంటకాల్లో ఫేమస్ అయిన ఫిష్ రిసిపి అలెప్పే ఫిష్ కర్రీ. ఈ ఫిష్ కర్రీ కోకనట్ మిల్క్ గ్రేవీలో మెత్తగా ఉడికించడం అన్నమాట. చాలా తక్కువ మసాలాదినుసులు
ఉపయోగించి తయారుచేస్తారు. ఈ ఫిష్ కర్రీ ఇతర ఫిష్ కర్రీలను డామినేట్ చేస్తుంది. అలెప్పె ఫిష్ కర్రీని తయారుచేయడానికి ముఖ్యంగా చేపలను తాజాగా ఉన్న చేపలు లేదా పాంఫ్రెట్ లేదా కింగ్ ఫిష్ ను తీసుకోవాలి . ఈ మంచి ఫ్లేవర్ కలిగిన ఫిష్ కర్రీ, ఫిష్ లవర్స్ కోసం ఒక అద్భుతమైన ట్రీట్. ఈ టేస్టీ ఫిష్ కర్రీ ఖచ్చితంగా చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని రుచుచూడాలంటే ముందుగా దీన్ని ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలి.... కావల్సిన పదార్థాలుకావలసిన పదార్థాలు: చేప ముక్కలు - 1/2kg ఆవాలు - 1tsp కొబ్బరి నూనె - 50grm మెంతిపొడి - 1/4tsp అల్లం తురుము- 1tsp వెల్లుల్లి తరుగు - 1/4cup పచ్చిమిర్చి - 8-10(సన్నగాతరిగిపెట్టుకోవాలి) READ MORE: కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై: టేస్టీ అండ్ క్రిస్పీ కరివేపాకు - రెండు రెమ్మలు పసుపు - 1/4tsp కాశ్మీరి చిల్లీ పౌడర్ - 1tsp ధనియాల పొడి - 1tsp కొబ్బరి పాలు - 1cup(చిక్కటివి), పల్చనివి: 1/2cup ఉప్పు - రుచికి సరిపడా ఉల్లి తరుగు - 1/2cup పచ్చి మామిడి కాయ ముక్క - 1చిన్నది టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
మలబార్ ఫిష్ కర్రీ: స్పైసీ కేరళ వంటకం
తయారు చేయు విధానం:
1. ముందుగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి.
2. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగులు, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేసి వేగించాలి.
3. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి మామిడి ముక్కలు, చేప ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి.
4. తర్వాత రెండవసారి మిక్సీ వేయగా వచ్చిన పల్చని కొబ్బరిపాలు పోసి చేప ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించాలి.
5. కొద్దిగా చేపలు ఉడికిన తర్వాత చిక్కటి కొబ్బరిపాలు పోసి పొయ్యి నుంచి దింపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలెప్పె ఫిష్ కర్రీ రిసిపి రెడీ.

No comments:

Post a Comment