Thursday, December 10, 2015

స్పైసీ అండ్ టేస్టీ పనీర్ పకోడా రిసిపి

వింటర్ లో సాయంత్ర సమయాల్లో టీ, కాఫీలతో పాటు ఏదైనా సాడ్ విచ్ తినాలనిపిస్తుంటుంది. అయితే ఈ పన్నీర్ పకోడ మంచి రుచితోపాటు, ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషియన్స్ ను అందిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు
అమితంగా ఇష్టపడి తింటారు. పనీర్ తో తయారుచేసే వంటలు చాల రుచికరంగా ుంటాయి . చలిగా ఉన్న రోజుల్లో ఇలాంటి స్పైసీ స్నాక్ తయారుచేసుకొని తనడం భలే మజాగా ఉంటుంది. పనీర్ తో వివిధ రకాల వంటలు చేసినప్పటికీ, స్నాక్ రసిపి చాలా వెరైటీగా ఉంటుంది. ఈ పనీర్ రిసిపి చాలా సింపుల్ గా , త్వరగా తయారుచేసుకోవచ్చు . పనీర్ లో అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను దూరం చేస్తుంది. మరి ఈ హెల్తీ, అండ్ టేస్టీ పనీర్ స్నాక్ ఎలా
తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు : 200grm(కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) శెనగపిండి: 2కప్పులు గరం మసాలా: 1tbps ధనియాలపొడి: 1/2tsp పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి) బియ్యం పిండి: 1/2cup ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, గరం మసాలా, ధనియాలపొడి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి అందులో పనీర్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
3. పనీర్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
4. మొదట కలిపి పెట్టుకొన్న శెనగపిండి మిశ్రమంలో ఫ్రై చేసుకొన్న పన్నీర్ ముక్కలు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.
5. అంతలోపు మరో డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి నూనె వేసి కాగిన తర్వాత అందులో పన్నీర్ మిశ్రమాన్ని వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
6. సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని వేడి వేడి పనీర్ స్నాక్ స్పైసీ ట్యాంగీ సాస్ తో సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment