Tuesday, December 15, 2015

కిడ్నీ స్టోన్స్: మహిళలు నిర్లక్ష్యం చేయకూడని 10 లక్షణాలు


కిడ్నీ స్టోన్ అనేది సాధారణ సమస్య కాదు . ప్రతి 10 మందిలో 7 మంది కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నట్లు అందులోనే కిడ్నీస్టోన్ సమస్యలు ఎక్కువగా మహిళల్లో ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. కిడ్నీలో కొన్ని రకాల కెమికల్స్ కరిగకపోవడం వల్ల అవి స్టోన్స్ గా రూపాంతరం చెందుతాయి . ఈ ప్రాబ్లమాటిక్ కండీషన్ ను
వైద్యపరిభాషలో నెప్రోలిథియాసిస్ లేదా యూరోలిథియాసిస్ అనిపిలుస్తారు. అలాగే స్ట్రూవిట్ స్టోన్స్ అని కూడా అంటారు . కిడ్నీస్టోన్స్ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, మరియు అనిమల్ ప్రోటీన్ మరియు ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్ట్రోన్స్ కు దారితీస్తుంది . మరో వైద్యపరమైన కారణం క్యాల్షియంతో పాటు యాంటీసిడ్స్ అధికంగా ఉండే మెడికేషన్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడుటకు కారణం అవుతాయి. కిడ్నీలో స్టోన్స్ కు మీరు తీసుకొనే ఆహారమే కారణమా... కిడ్నీస్టోన్స్ ను నివారించుకోవడం చాలా సులభం. వీటిని కొన్ని మెడికేషన్స్ ద్వారానే కరిగిపోయేలా చేసి మూత్రంతో పాటు బయటకు వచ్చే విధంగా చికిత్సవిధానాలు అందుబాటులో ఉన్నాయి . అయితే ఇవి చిన్న సైజు కిడ్నీ స్టోన్స్ ను మెడికేషన్స్ ద్వారా తొలగించుకోవచ్చు. అయితే పెద్దసైజులో ఉండే కిడ్నీ స్టోన్స్ కు మెడిసిన్స్ పనిచేయక అవి యురేత్రాలోనికి చేరుతాయి. ఇది బ్లాడర్ కు కిడ్నీకి న్యారో ట్యూబ్ లా ఉంటుంది . కిడ్నీ స్టోన్స్ ఈ యురేత్రాలో వచ్చి చేరడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా తయారవుతుంది. ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి సహజ పద్దతులు కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మహిళలు కిడ్నీస్టోన్స్ ను ముందుగానే గుర్తించడానికి కొన్ని సంకేతాలు లేదా లక్షణాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుపుతున్నాము. ఈ లక్షణాలను కనుక మహిళలు ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే శరీరం నుండి స్ట్రోన్స్ బయటకు ఫ్లష్ అవుట్ చేయడానికి మరింత సులభం అవుతుంది.

No comments:

Post a Comment