Tuesday, December 22, 2015

ఫ్యాట్ బర్న్ చేసి అధిక బరువు తగ్గించే కొబ్బరి...

ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడుతున్న సహజ ఫలము కొబ్బరి. నేటి ఆధునిక ప్రపంచంలో కొందరు నిపుణులు జరిపిన పరిశోధన ద్వారా కొబ్బరిలో అనేక ఆరోగ్య రహస్యాలున్నట్లు
కొనుగొన్నారు. కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే. వారి ఆరోగ్యమూ, సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కొకొనట్ మిల్క్ తో క్యాన్సర్ కి చెక్ కొబ్బరిలో మరియు కొబ్బరి నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రో లైట్స్, ఎంజైమ్ లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. ఈ నీళ్ళు ఉపశాంతినిచ్చే వగరు రుచికి, దాని ఆరోగ్య ప్రయోజనాలకి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. కొబ్బరి కేవలం ఆరోగ్యానికే కాదు.. శరీర దృఢత్వానికీ అవసరమే. కానీ కొబ్బరి తినడం వల్ల దగ్గు వస్తుందేమోనని కొంతమంది అనుకుంటుంటారు. ఇది ఎంత వరకు నిజమన్నది కాసేపు పక్కన పెడితే.. కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందని.. దీనికి కారణం ఇందులో ఉండే శ్యాచురేటెడ్ కొవ్వు పరిమాణమేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆశ్చర్యపోతున్నారా? అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ముందు కొబ్బరికీ.. బరువు తగ్గడానికీ ఎలాంటి సంబంధముందో తెలుసుకోవాలి..

No comments:

Post a Comment